Friday, April 26, 2024
- Advertisement -

నిను వీడని నీడను నేనే రివ్యూ

- Advertisement -

సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా నటించిన చిత్రం నిను వీడని నీడను నేనే. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులకి సందీప్ కిషన్ నుండి ఒక చిత్రం వచ్చింది, అందులోనూ సందీప్ ఈ సినిమా తో నిర్మాత గా కూడా మారాడు. కార్తిక్ రాజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే కొంత ఆసక్తి తీసుకొని వచ్చింది. ఇక సినిమా సమీక్ష విషయానికి వస్తే..

కథ: పెళ్ళి చేసుకున్న జంట రిషి (సందీప్ కిషన్), దియా (అన్య) ఇద్దరూ కలిసి ఒక బిల్డింగ్ లో నివసిస్తూ ఉంటారు. అయితే ఇద్దరికీ అద్దం లో వారి మొహం కాకుండా వేరే వాళ్ళ మొహం కనిపిస్తుంది. ఇది చూసి సడన్ గా ఇద్దరూ షాక్ అవుతారు. అసలు వాళ్ళకి అద్దం లో కనిపిస్తుంది ఎవరు? వీళ్ళకే ఎందుకు కనిపిస్తున్నారు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ.

నటీనటులు: సినిమాలో సందీప్ కిషన్ చాలా అద్భుతంగా నటించారు. తన పాత్రలో ఉన్న వేరియేషన్స్ ని చూపిస్తూ సందీప్ కిషన్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ముందు సినిమాలతో పోలిస్తే సందీప్ కిషన్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డట్టు తెలుస్తోంది. అన్య సింగ్ సినిమాలో కేవలం తన అందంతో మాత్రమే కాక నటన తో కూడా బాగానే మేప్పిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే కాకుండా హారర్ సన్నివేశాల్లో కూడా అన్య సింగ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించింది. వెన్నెల కిషోర్ కి ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్ర అని తెలుస్తోంది. తన పాత్రకు ప్రాణం పోశారు వెన్నెల కిషోర్. మురళి శర్మ మరియు ప్రగతి చాలా సహజంగా నటించారు. పోసాని కృష్ణ మురళి నటన సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం: దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్నారు. ఒక సరికొత్త కాన్సెప్ట్ తో సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. మిగతా హారర్ మరియు థ్రిల్లర్ చిత్రాలకు ఈ సినిమా భిన్నంగా ఉంటుందని కచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆడియన్స్ మెచ్చే విధంగా మాత్రం ఉండదు. ఒక ఆసక్తికరమైన కథ చుట్టూ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉండే స్క్రీన్ప్లేతో దర్శకుడు కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు అనుకుంటే ఆ స్క్రీన్ ప్లే నే ఈ సినిమా కి మైనస్ గా మారింది. దర్శకుడు కథను నెరేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పతాకంపై దయ పన్నెం మరియు విజి సుబ్రహ్మణ్యం అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద గా హెల్ప్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. పాటలు సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి థమన్ అందించిన నేపథ్య సంగీతం లౌడ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో తమన్ మ్యూజిక్ మంచిగా అనిపించలేదు. పీకే వర్మ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

తీర్పు: మిగతా హారర్ మరియు థ్రిల్లర్ సినిమాలో లాగా ఒక కొత్త ఇంటికి వెళ్లడం అక్కడ ప్రాబ్లమ్స్ మొదలవడం వంటి రొటీన్ కథ లకు భిన్నంగా దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమా కోసం ఒక సరికొత్త కాన్సెప్ట్ తో కథను సిద్ధం చేశారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. మొదటి హాఫ్ మొత్తం హారర్ అంశాలు, కొంత రొమాన్స్ మరియు కొంత కామెడీ తో నిండి ఉంటుంది. కాకపోతే హారర్ అని చెప్పి దానిని పూర్తిగా వాడుకోలేదు దర్శకుడు. కొన్ని సన్నివేశాలను చాలా ఆర్టిఫిషియల్ గా తీశారు. మొదటి హాఫ్ కొంచం స్లో అయినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా లో స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. చాలా మటుకు సినిమా బోర్ ఫీలింగ్ వస్తుంది. నటీనటులు కూడా ఆశించిన మేరకు నటించలేదు. నేపథ్య సంగీతం ఈ సినిమా లో చాలా లౌడ్ గా అనిపిస్తుంది. కొన్ని సాగతీత సన్నివేశాలు తీసేసి ఉంటే సినిమా మరింత బాగుండేది. చివరగా ‘నిను వీడని నీడను నేనే’ ఆశించిన మేరకు లేదు. నిరాశపరిచింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -