Saturday, April 20, 2024
- Advertisement -

మ‌ళ‌యాళ సినిమాలలోకి శృంగార తార‌

- Advertisement -

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో నటించింది. ఇప్పుడు మలయాళంలో కూడా నటించడానికి రెడీ అవుతోంది. సంతోష్ నాయర్ దర్శకత్వంలో రూపొందే ‘రంగీల’ చిత్రంలో సన్నీ నాయికగా నటించనుంది. ఇప్ప‌టికే హింది,తెలుగు సినిమాల‌లో న‌టించిన స‌న్ని,ఓ క‌న్న‌డ సినిమాలో కూడా న‌టిస్తుంది. అయితే స‌న్నీలియోన్ కన్న‌డ సినిమాల‌లో న‌టించ‌డానికి వీలు లేద‌ని కొంద‌రు ధ‌ర్నాలు చేస్తున్నారు.

స‌న్నీలియోన్‌కు,క‌ర్ణాట‌క వాసుల‌కు మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా వివాదం నడుస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌న్నీలియోన్‌కు న‌టిస్తున్న ‘వీరమదేవి సినిమాపై నిషేదం విధించాల‌ని మధురైలోని సెల్లూరుకు చెందిన సరవణన్‌ అనే న్యాయవాది మధురై బెంచ్ లో ప్రజాహిత వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు ఒక నటిని పలానా పాత్రలో నటించవద్దని చెప్పడం సరికాదని, పాత్రకు సరిపోతారనుకుంటే ఏ పాత్రనైనా చేయవచ్చని, కాబట్టి విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. దీంతో ఈ చిత్రానికి ఆటంకాలు తొలగిపోయాయి.ఈ చిత్రంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టివేసింది. ఈ సినిమాలో వీరమదేవి పాత్రలో సన్నీలియోన్‌ నటిస్తోంది. దీంతో స‌న్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.మొత్త‌నికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌చ్చిన స‌న్నీ త‌రువాత అన్ని భాష‌ల‌ను క‌వ‌ర్ చేస్తు కుర్ర‌కారుకి నిద్ర లేకండా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -