సూపర్ న్యూస్ : చిరు సినిమాలో మహేష్ కన్‌ఫర్మ్..!

859
super star mahesh babu confirmed in chiranjeevis next film
super star mahesh babu confirmed in chiranjeevis next film

కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది కన్ ఫర్మ్ అని తెలింది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబోలో శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

అందుకే చిరు సినిమాలో చేయడానికి మహేష్ ఒప్పుకున్నారు. ఓ పక్క చిరంజీవి, మరోపక్క మహేష్ బాబు.. తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. ఈ సినిమా కోసం మహేష్ 25 రోజుల కాల్‌షీట్స్ ఇచ్చారట. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఇదే కాకుండా అనిల్ రావిపూడి తీసే F3లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మహేష్ బాబు కూడా సందడి చేయబోతున్నారు.

ఇక వంశీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ కు నచ్చకపోవడం వల్లే ఆ సినిమాని కాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గీత గోవిందం దర్శకుడు పరశురాం ఓ చక్కని కథను మహేష్ కు వినిపించారట. ప్రస్తుతం మహేష్ ముంబయిలో థంప్స్ అప్ యాడ్ షూట్ లో ఉన్నారు. అక్కడే సందీప్ రెడ్డి వంగా చెప్పే కథ వినబోతున్నారని టాక్.

Loading...