వరల్డ్ రికార్డ్ సృష్టించిన మహేష్ బర్త్ డే ట్రెండ్

570
Superstar Mahesh Babu's Birthday Trend Creates World Record
Superstar Mahesh Babu's Birthday Trend Creates World Record

ఆగస్ట్ 9న పుట్టిన రోజు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజు, మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా పంపిన మీ విషెస్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మరియు ఫ్యాన్స్ కు మీరు పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. – ప్రేమతో మీ మహేష్ బాబు.”

60.2 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ట్రెండ్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ అభిమానులు ట్విట్టర్ లో #HBDMaheshBabu హాష్ టాగ్ తో ట్వీట్ చేశారు. 60.2 మిలియన్ ట్వీట్స్ తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హాష్ టాగ్ గా రికార్డ్ సృష్టించింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో ఈ వరల్డ్ రికార్డ్ సాధించడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి అభిమానులందరూ ఈ పర్యావరణ కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు జన్మదిన సందర్భంగా తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ నుండి విడుదలైన మోషన్ పోస్టర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టగానే సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Loading...