అవకాశాలు లేక సురేఖా వాణి ఏం చేస్తుందో తెలుసా ?

1475
Surekha Vani To Re Enter On Television
Surekha Vani To Re Enter On Television

తెలుగు ప్రేక్షకులకు తన నటనతో ఎంతో దగ్గర అయింది నటి సురేఖా వాణి. ఈమె చాలా సినిమాల్లో నటించింది. అక్క, వదిన, తల్లి, పిన్ని పాత్రలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ ఏం రావడం లేదు. చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి. సురేఖా వాణి తెలుగులో చివరిగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్‌యు’. ఇదొచ్చి రెండేళ్లు అవుతోంది.

అయినప్పటికి సురేఖా వాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంది. తన కూతురు సుప్రీతతో టిక్ టాక్ వీడియోలు కూడా చేసి తన అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రెండు తమిళ సినిమాలు. లాక్ డౌన్ తర్వాత ఈమె షూటింగ్ లో జాయిన్ కానుంది. అయితే సినిమాల్లో పాత్రలు పెద్దగా రాకపోవడంతో టీవీ వైపు చూస్తుందట సురేఖ. ఈ విషయంను ఆమెనే స్వయంగ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిజానికి సురేఖా వాణి కెరీర్ ప్రారంభమైందే బుల్లితెరపై.

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సురేఖకు డైరెక్టర్ సురేష్ తేజ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’, ‘హార్ట్ బీట్’ వంటి షోలలో అవకాశం ఇచ్చారు. వీటితో ఆమె పాపులర్ అయ్యారు. ఆ తరవాత సురేష్ తేజనే సురేఖావాణి పెళ్లాడారు. అయితే, కిందటేడాది మే 6న సురేష్ తేజ కన్నుమూశారు. ఇంకోవైపు సూరేఖ తన కూతురు సుప్రీతను హీరోయిన్ గా పరిచయం చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Loading...