Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కోసం విభేదాలను వదిలి కలిస్తున్న హిట్ జోడి..?

- Advertisement -

కొన్ని కలయికలు వండర్ లను సృస్టిస్తాయి,వారి కాంబో మంచి మంచి సినిమాలను, బీలో యావరేజ్ గా ఉన్న సినిమా లు సైతం సూపర్ హిట్ గా నిలిచిపోతాయి.. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ లు ఎన్నో ఉన్నాయి.. ఆనాటి ఎన్టీఆర్ దగ్గరినుంచి ఈనాటి విజయ్ దేవరకొండ వరకు వారు క్రేజీ కాంబో లతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలనీ కోరుకుంటారు.. అయితే ఇది కేవలం నటులమధ్యే కాదు సాంకేతిక నిపుణుల మధ్య కూడా ఉంటుంది.. ముఖ్యంగా డైరెక్టర్, రైటర్ కాంబినేషన్ కుదిరితే ప్రతి సినిమా ఓ సూపర్ హిట్ అవుతుంది..

అలా ఓ ఇద్దరు కలిసి చేసిన సినిమా లు అన్ని సూపర్ హిట్ లు. అయితే కొన్ని కమిట్మెంట్ ల రీత్యా వారిద్దరూ గత కొన్ని సినిమాలు గా దూరంగా ఉన్నారు. వారే డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశి.. వీరి కలయిక లో ఎన్ని సూపర్ హిట్ లు వచ్చాయంటే అతనొక్కడే దగ్గరినుంచి మొదలైన వీరి సినీ ప్రయాణం రేస్ గుర్రం వరకు అలుపెరగకుండా కొనసాగింది. కానీ వక్కంతం వంశీ కి మధ్య లో దర్శకత్వం చేయాలనే ఆలోచన రావడంతో వీరి కాంబో కి తెరపడింది.. అయితే ఒకరినొకరు కాదని ఇద్దరు గొప్ప సినిమాలు ఏమీ తీయలేదు..

వక్కంతం వంశి నా పేరు surya అంటూ తీసిన సినిమా బన్నీ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది.. ఇక సురేందర్ రెడ్డి కూడా ఒక రీమేక్ సినిమాని, ఒక బయోపిక్ ని తీసి తన చేతులు మట్టి అంటకుండా సినిమా చేసి హిట్ కొట్టినా అందులో డైరెక్టర్ ప్రతిభ ఏమీ లేదు.. దర్శకత్వంతో మంచి పేరు కొట్టేసినా రచనా పరంగా సురేందర్ రెడ్డి వీక్ అని తేలిపోయింది.. ఇక వీరిదరు ఇప్పుడు కలబోతున్నట్లు తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కి ఓ సినిమా ఛాన్స్ ఇబ్బబోతున్నాడట.. దానికి వక్కంతం వంశి స్టొరీ ఇస్తున్నాడని తొందరలోనే వీరో కాంబో లో మరో సినిమా రాబోతుందని వారి సినిమా లను ఇష్టపడే అభిమానులు చెప్తున్నారు.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -