రానా, మిహికా ఎంగేజ్మెంట్ జరగలేదు : సురేష్ బాబు

242
suresh babu denies miheeka rana engagement fake news
suresh babu denies miheeka rana engagement fake news

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రానా దగ్గుబాటి పెళ్లి గురించి వార్తలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. రానా తన ప్రేయసిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే బుధవారం నాడు వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఎంగేజ్మెంట్ జరగలేదట. ఆ విషయంపై రానా తండ్రి సురేష్ బాబు వివరణ ఇచ్చారు. ఇన్నాళ్లు సీక్రెట్ గా లవ్ ట్రాక్ ని నడిపిన దగ్గుబాటి హీరో ఫైనల్ గా ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఇటీవల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. రానా, మిహికా బజాజ్ ఎంగేజ్మెంట్ బుధవారం సాయంత్రం జరగనున్నట్లు గత వారం నుంచి కథనాలు వెలువడ్డాయి. కేవలం కొద్దీ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే రానా మిహికా నిశ్చితార్థం ద్వారా మరింత దగ్గరకాబోతున్నట్లు టాక్ వచ్చింది. రామానాయుడు స్టూడియోలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు అలాంటి ఈవెంట్ జరగలేదని తెలిసింది.

ఎలాంటి నిశ్చితార్థ వేడుకలు జరగలేదని నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. మొదటిసారి ఇరు వర్గాల కుటుంబాల పెద్దలు కూర్చొని పెళ్లికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే చర్చించినట్లుగా రానా తండ్రి సురేష్ బాబు అధికారికంగా వివరణ ఇచ్చారు. అలాగే పెళ్లి డేట్ కూడా ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటే బావుంటుందనే విషయంపై కూడా మాట్లాడుకున్నట్లు తెలిపారు. పెళ్లికి ముందు జరగాల్సిన ఈవెంట్స్ తో పాటు పెళ్లి తరువాత జరగాల్సిన సంబరాలపై కూడా రానా, మిహికా కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకున్నారట. ప్రీ వెడ్డింగ్ ప్లాన్ పై ఇప్పటికే నిర్ణయనికి వచ్చినట్లు తెలుస్తోంది.

Loading...