Thursday, April 25, 2024
- Advertisement -

బందోబస్త్ ప్లాప్ మర్చిపోయేలా సూర్య మాస్టర్ ప్లాన్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండేది. కానీ ఈ మధ్య వరుస డిజాస్టర్ లతో ఆ మార్కెట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఎన్ని డిజాస్టర్లు అందుకున్నప్పటికీ సూర్య కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక సినిమా పూర్తయ్యే లోపే మరో సినిమా ఓకే చేసేసి కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. ఈ మధ్యనే సూర్య హీరోగా ‘బందోబస్త్’ సినిమా విడుదలైంది. మోహన్ లాల్, ఆర్య, సయేశా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే సూర్య తన తదుపరి సినిమా ఓకే చేసేశారు.

సూర్య తన నెక్స్ట్ సినిమా సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్నాడు. ‘సూరారై పోట్రూ’ అనే టైటిల్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకవైపు ‘బందోబస్త్’ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరోవైపు ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు సూర్య. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ మధ్యనే చిత్ర బృందం షూటింగ్ ని పూర్తి చేసి నిర్మాణాంతర పనులతో బిజీ అయింది. ఈ పనులను కూడా త్వరగా పూర్తిచేసి సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ని త్వరలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -