Friday, April 19, 2024
- Advertisement -

భారీగా పడిపోయిన సూర్య మార్కెట్

- Advertisement -

తమిళ నటుడు సూర్య కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ గత కొంతకలంగా సూర్య టాలీవుడ్ లో ఒక్క మంచి హిట్ కూడా అందుకోలేదు. ఇంతకు ముందు సూర్య సినిమాలకి తెలుగులో పెద్ద మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు సూర్య ఇమేజ్ బాగా పడిపోయిందని చెప్పాలి. ఈ మధ్యనే సూర్య నటించిన ‘ఎన్జికే’ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా నిన్నకాక మొన్న విడుదలైన ‘బందోబస్త్’ సినిమా కూడా టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించలేకపోయింది. విడుదలకు ముందు కూడా ఈ సినిమాపై పెద్ద అంచనాలను ఏమీ లేవు.

ఓపెనింగ్ డే రోజు కూడా మంచి వసూళ్లను తెచ్చుకోలేక పోయిన ఈ సినిమా ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్లను నమోదు చేసుకోలేకపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజున కోటి రూపాయల షేర్ ని కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. ఇక వారాంతం లో కూడా సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు సూర్య మార్కెట్ పడి పోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది తన స్క్రిప్ట్ సెలక్షన్ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -