సూర్య నిర్ణయం.. అభిమానుల్లో కలవరం

148
Suriya once again movie with Gautham Menon
Suriya once again movie with Gautham Menon

తమిళ సినిమా పరిశ్రమ లో ఉన్న అగ్ర హీరోలు ఒకరు సూర్య ఆయన ప్రస్తుతం తన తదుపరి సినిమా బందోబస్త్ కి సంబందించిన ప్రమోషన్స్ తో బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో ఆయన హైదరాబాద్ కి వచ్చి ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు అయ్యి, ఆ పిమ్మట కొంత మందికి ఇంటర్వూస్ ఇచ్చారు.

ఏ ఇంటర్వ్యూ లో అయినా ఎవరిని అయినా చివరగా అడిగే ప్రశ్న తదుపరి సినిమాల గురించి. అయితే ఈ ప్రశ్నకి జవాబు ఇస్తూ సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా ని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి అభిమానుల్లో కలవరం మొదలైందట.

సాధారణం గా ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాలు రెండు విడుదల కాకుండా ఆగిపోవడం తో ఆయన తో సినిమా అవసరమా అనే దృష్టి తో అభిమానులు చూస్తున్నారు. అనవసరం గా ఎందుకు ఈ సినిమా ని మీద వేసుకోవడం అనే దృక్పథం తో వారు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం సూర్య వరకు చేరిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Loading...