Friday, April 19, 2024
- Advertisement -

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్టుమార్టం రిపోర్టు..!

- Advertisement -

ఆదివారం (జూన్ 14) ఉదయం 10 నుంచి ఒంటి గంట మధ్యలోనే యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు ముంబైలోని అతని ఇంటికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. అనుమానించేలా ఏమీ కనిపించలేదని తొలుత పోలీసులు వెల్లడించారు. పోలీస్ విచారణ ప్రారంభమైన సమయం 2-2.30. అయితే అప్పటికే సుశాంత్ బెడ్ పై పడి ఉన్నాడు.

ఉరికి వేలాడిన అతడి మృతదేహాన్ని స్నేహితులు.. ఆఫీస్ స్టాఫ్ కిందికి దించారు. సూసైడ్ ఉదయం 10నుంచి 1గంట మధ్యలోనే అయ్యుండాలని పోలీసులు సందేహించారు. అయితే సుశాంత్ రెగ్యులర్ గా హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అది దేనికోసం? అన్నది అతడు వాడుతున్న మందుల ఆధారంగా విచారించారు. అయితే ఐదారు నెలలుగా అతడు డిప్రెషన్ కి మెడిసిన్ తీసుకుంటున్నాడని సాగుతున్న ప్రచారంలో నిజం ఎంత? అన్నది ఇంకా పోలీసులు వెల్లడించలేదు.

అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే క్లారిటీ వస్తుందన్నది వారి వెర్షన్. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు.

‘పెంగ్విన్’ టీజ‌ర్ రివ్యూ!

ప్రేమకథ సినిమా చేస్తా అన్న అభిరామ్.. శ్రీరెడ్డి హీరోయినా అని సెటైర్లు..!

యాంకర్ రవి వాళ్ళ అమ్మగారి బర్త్ డే సెలబ్రేషన్స్..!

బాలయ్యకు ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -