Tuesday, April 23, 2024
- Advertisement -

నాకు బికినీ వేసే సీన్ లేదు – స్వాతి

- Advertisement -

కలర్స్ ప్రోగ్రాం తో ఏ ముహూర్తం లో అడుగు పెట్టిందో కానీ పదేళ్ళ తరవాత ఇప్పటికీ ఆమెని గుర్తు పట్టాలి అంటే కలర్స్ స్వాతి అనే పిలుస్తారు అందరూ.

అంతగా తెలుగు వారికి ఆ ప్రోగ్రాం తో బాగా కనక్ట్ అయిన ఆ క్యూట్ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా అవలేక తెగ ఇబ్బందులు పడుతోంది. అన్నీ హోమ్లీ పాత్రలు చేస్తూ మినిమం ఎక్స్పోజింగ్ కి కూడా నో చెప్పేస్తున్న స్వాతి తనకి పెద్ద ఆశలు లేవు అని ఎక్కడికో చేరిపోవాలి అనే వింత ఆలోచనలు లేవు అని ఉన్నంతలో హ్యాపీగా ఉన్నా అని చెబుతోంది. పదేళ్ళ పాటు తెలుగు సినిమాల్లో కొనసాగిన ఏ సాధారణ హీరోయిన్ అయినా ఈ పాటికి స్టార్ అయిపోయి కనీసం కోటి రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉండాలి కానీ స్వాతి విషయంలో ఇది వర్క్ అవ్వలేదు.

దానికి చాలా కారణాలు చెప్పుకోచాలి. పెర్ఫార్మెన్స్ తో అన్ని సార్లూ నెట్టుకురావడానికి ఇది సావిత్రి యుగం కాదు అని సమంత యుగం అని తెలుసుకోవాలి ఆమె. ” నాకు ఫుడ్ అంటే ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం, ఆ దేవుడు ఇచ్చిన ఈ ఒకేఒక్క జీవితం లో దాన్ని శుబ్రంగా తినేసి ఎంజాయ్ చెయ్యడం మానేసి ఇష్టం వచ్చినట్టు ఆలోచించి. గ్లామర్ గా కనపడాలి అనే ఆలోచనలో తాపత్రయంలో తిండి మానేసి జిమ్ లకి వెళ్లి బాడీ మైంటైన్ చెయ్యడం నాకు ఇష్టం లేదు. ఇదంతా చేస్తేనే స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుంది అంటే నాకు నచ్చాదు. దానికోసం నేను నోరు కట్టుకోవాలి కానీ అది నావల్ల కాదు ” అంటోంది స్వాతి. ఇక బికినీ విషయం గురించి అడిగితే. బికినీ వెయ్యడం నా బాడీతో జరిగే పని కాదు సినిమాల్లో బికినీలు వేసి బాలీవుడ్ కి వెళ్ళిపోవడం నా కల కాదు కాబాట్టి ఇబ్బందేం లేదు” అని చెప్పింది. 

Also Read : ప్రేక్షకుడి దెబ్బకు దెయ్యం దిగింది..

{youtube}MWfflpyg2k0{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -