భర్తతో విడిపోవడానికి కారణం చెప్పిన శ్వేతాబసు ప్రసాద్..!

17116
Swetha Basu Philosophy on Divorce
Swetha Basu Philosophy on Divorce

హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ నిజ జీవితం గురించి అందరికి తెలిసిందే. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసి.. తక్కువ టైంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే గతంలో ఈమెపై వ్యభిచారం ఆరోపణలు.. అరెస్ట్ అనంతర పరిణామాలు తన లైఫ్ ను డైలామాలో పడేసింది. ఆ తర్వాత తనపై వచ్చిన ఆరోపణల్ని ఆమె ఖండించినప్పటికి అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది.

ఆ తర్వత టాలీవుడ్ కి బై చెప్పి లఘు చిత్రాలు, డ్యాక్యుమెంటరీలతో కాలక్షేపం చేసింది. అనురాగ్ బసు లాంటి గురువుతో కలిసి పలు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసింది. ఈ క్రమంలో 2018 లో శ్వేతాబసు తన బోయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ ఇద్దరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అతడితో అభిప్రాయ బేధాలు రావడం తో పెళ్లాడిన ఏడాదికే విడిపోవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.

అయితే విడాకులు తీసుకోవడానికి కారణాలపై ఇప్పటి వరకూ శ్వేతాబసు స్పందించ లేదు. తాజాగా అందుకు కారణాల్ని శ్వేతాబసు వెల్లడించింది. మీమిద్దరం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజి నుంచి చివరి పేజీ వరకూ ఒకే విధంగా చదవలేం. మొదటి పేజీ చదివినంత ఆసక్తి చివరి వరకు ఉండదు. అంత మాత్రన ఆ పుస్తకం సరైనది కాదని అనలేం.

మా జీవితం ఓ అసంపూర్ణమైన పుస్తకం లాంటిది అని చెప్పింది. రోహిత్ నుంచి విడిపోయినప్పటికి మంచి ఫ్రెండ్స్ లా ఉంటామని తెలిపింది. అయితే ఈమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అప్పుడే పెళ్లి.. జీవితం.. విడి పోవడం గురించి తెలుసుకున్నావా ? జీవితాన్ని అసంపూర్ణ పుస్తకంతో ముడి పెడతావా ? అంటూ కొందరు నెటిజనులు మండి పడుతున్నారు.

Loading...