Friday, April 26, 2024
- Advertisement -

కర్నూల్ లో జరగనున్న సైరా వేడుక

- Advertisement -

ప్రస్తుతం అందరి కళ్ళు మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ పైనే ఉన్నాయి. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది మూవీ యూనిట్. ఇప్పటికే విడుదలైన సైరా టిజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈనెల 21న క‌ర్నూలులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాల‌ని చిత్రబృందం భావిస్తోంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ కి చెందిన వాడు. అందుకే రాయలసీమలోని కర్నూల్ లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగబోతోంది. అయితే ప్రీ రిలీజ్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ మరియు విశాఖపట్నం లోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రచార కార్యక్రమాలని చేపట్టనున్నారు. ఈలోగా సినిమా నుంచి కొన్ని పాటలు విడుదల కాబోతున్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ సినిమా టైటిల్ సాంగ్ త్వరలో విడుదల కాబోతోంది. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -