సైరా సినిమా బయోపిక్ కాదు అంటున్న దర్శకుడు

464
Syeraa is not a biopic claims Surender Reddy
Syeraa is not a biopic claims Surender Reddy

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలను ఆపేయాలి అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమకు రావాల్సిన గౌరవ వేతనం ఇంకా ఇవ్వలేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో గురువారం నాడు కోర్టు హియరింగ్ జరిగింది. వారి ఆరోపణలకు వ్యతిరేకంగా సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బయోపిక్కే కాదని సురేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇదే విషయాన్ని సెన్సార్ బోర్డ్ కూడా హైకోర్టు కి క్లియరెన్స్ ఇచ్చింది. కొన్ని గంటల్లో హై కోర్టులో మరొక హియరింగ్ జరగనుంది. మరోవైపు సైరా సినిమా కి సెన్సార్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంపై హైకోర్టు నిర్ణయం సెప్టెంబర్ 30న విడుదలకానుంది. అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉంది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Loading...