Friday, March 29, 2024
- Advertisement -

టీజర్ రివ్యూ: చరిత్ర మొదలుపెట్టిన నరసింహ రెడ్డి

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఒకటి. స్వాతంత్రానికి చాలాకాలం ముందు బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మేకింగ్ వీడియో ఇప్పటికే నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. చిత్ర టీజర్ ను ఇవాళ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్ర టీజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ తో మొదలవుతుంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవతారంలో మెగాస్టార్ నటన అద్భుతంగా ఉంది. “వీరులారా.. చరిత్ర లో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి” అంటూ చిరు చెప్పే డైలాగ్ మరియు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నయనతార విజయ్ సేతుపతి అమితాబచ్చన్ సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -