Friday, March 29, 2024
- Advertisement -

ట్రైలర్ తోనే భయపెట్టిన తాప్సీ

- Advertisement -

గత కొంతకాలంగా తెలుగు సినిమా లకు దూరంగా ఉంటున్న తాప్సి పన్ను తాజాగా ‘గేమ్ ఓవర్’ అనే సినిమాతో టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి అశ్విని శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వీడియో లో తాప్సీ యానివర్సరీ రియాక్షన్ అనే ఒక డిజార్డర్ తో బాధపడుతూ ఉంటుంది. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకు ఒక త్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఒకవైపు తాప్సీ పాత్ర అలాంటి డిజార్డర్తో బాధపడుతూ ఉండగా మరొక వైపు ఒక సైకో కిల్లర్ హైదరాబాద్ అమ్మాయిలను చంపేస్తూ ఉంటాడు. ఈ సినిమా మొదటి నుంచి ఆఖరు వరకు ప్రేక్షకులను దృష్టిని కచ్చితంగా ఆకర్షిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలను ఏరికోరి ఎంచుకుంటున్న తాప్సి ఈసారి కూడా అలాంటి స్ట్రాంగ్ పాత్ర తో మన ముందుకు రాబోతుంది. ఎస్ శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి రాన్ ఈథాన్ యోహన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -