Tuesday, April 16, 2024
- Advertisement -

గెట్ వెల్ సూన్ అంటున్న తాప్సి

- Advertisement -

తాప్సి ఇటీవలే గేమ్ ఓవర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ తెచ్చుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరిగా ఆడడం లేదు. ఒక ట్విట్టర్ యూసర్ సినిమా మీద కామెంట్ చేస్తూ తాప్సి కి బాక్సాఫీస్ దగ్గర పవర్ లేదు అని అన్నాడు. దానికి తాప్సి కౌంటర్ వేస్తూ, పవర్ లేనిది తనకి కాదు, తన సినిమాలకి అని జెనరలైజ్ చేస్తూ చెప్పింది. అయితే అందరూ తాప్సి తన సినిమా గేమ్ ఓవర్ గురించే మాట్లాడుతుంది అని అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఎనలైజ్ చేస్తూ ఒక మీడియా సంస్థ ఒక ఆర్టికల్ కూడా రాసింది. అయితే తాప్సి ఈ విషయాన్నీ ఖండిస్తూ వారికి తిరిగి కౌంటర్ వేసింది.

“వావ్.. నా వ్యాఖ్యలని మీరు బాగానే అర్ధం చేసుకున్నారు. నాకు ఇప్పుడు అర్ధం అయింది మీరు అంతా సినిమా ని ఎలా తప్పుగా అర్ధం చేసుకున్నారో. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళని మెప్పించడం కష్టమే. త్వరగా కోలుకోండి.” అని వెటకారం గా వ్యాఖ్యానించింది.

అయితే తాప్సి నటించిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు కానీ తాప్సి నటి గా ఎప్పుడూ ఆదరణ పొందిన నటే అని చెప్పడం తన ఉదేశ్యం కానీ చివరికి అది కాస్త మిస్ ఫెయిర్ అవడమే కాక అందరూ తప్పుగా అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా వెటకారం గా ఆ వెబ్ సైట్ వారికి రిప్లై ఇచ్చినా కానీ తాప్సి మనసులో ఉన్నది ఎలా అర్ధం చేసుకుంటారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -