Friday, March 29, 2024
- Advertisement -

తాప్సి మళ్ళీ గ్లామర్ డాల్ గా మారుతుందా?

- Advertisement -

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసిన ఝుమ్మంది నాదం సినిమా తో తెరంగేట్రం చేసింది ఢిల్లీ భామ తాప్సి. ఆ సినిమా లో గ్లామరస్ పాత్ర లో నటించిన తాప్సి అందరినీ చాలా బాగా మెప్పించింది. తాప్సి కి ఈ సినిమా బాగా కలిసి వచ్చింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు కానీ గ్లామరస్ డాల్ ఇమేజ్ మాత్రం తాప్సి సంపాదించుకుంది. అందుకే ఆ తర్వాత తెలుగు లో ఆమెకి అలంటి గ్లామరస్ రోల్స్ చాలా వచ్చాయి. తాప్సి కూడా ఈ పాత్రలని చేసి అందరినీ మెప్పించింది కానీ క్రమక్రమం గా తాప్సి కి ఆ పాత్ర లు బోర్ కొట్టాయి.

మెల్లగా బాలీవడ్ లో ప్రవేశించిన తాప్సి మంచి సినిమాల తో విజయం సాధించి ఇటీవలే వచ్చిన గేమ్ ఓవర్ ద్వారా ఎంతో మందిని మెప్పించింది. ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వూస్ లో మాట్లాడుతూ గ్లామరస్ పాత్రల పై పెద్ద గా ఇంట్రస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు తాజాగా తాప్సి ఒక తెలుగు సినిమా సైన్ చేసిందట. అందులోనూ ఒక గ్లామరస్ పాత్ర వైపు మొగ్గు చూపించి అని టాక్.

ఇష్టం లేదంటూ నే తాప్సి ఒక గ్లామరస్ పాత్ర ఒప్పుకుంది అంటే మరి ఆ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -