Wednesday, April 24, 2024
- Advertisement -

బోర్ ఫీల్ అవుతున్న తాప్సి

- Advertisement -

సినిమా పరిశ్రమ లో మొదటగా గ్లామర్ పాత్ర ల తో కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సి మెల్లగా బాలీవుడ్ లో పెర్ఫార్మన్స్ ఉన్న పాత్ర లు పోషించి అందరి మన్ననలు పొందింది. పింక్ సినిమా విజయం తాప్సి ని శాశ్వతంగా బాలీవుడ్ పరిశ్రమ లో ఉండేలా చేసింది. ఆ సినిమా అందించిన విజయం తాప్సి కి చాలా బాగా ఉపయోగపడింది.కొన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలు పోషిస్తూ వాటిల్లో తన బెస్ట్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది తాప్సి. ముఖ్యం గా అమితాబ్ తో చేసిన పింక్ మరియు బద్లా సినిమాల్లో ఒక రేప్ విక్టిమ్ గా చేసి అందరినీ ఆకట్టుకుంది.

అయితే అవి విజయవంతం అవ్వడం తో ఆ తర్వాత నుంచి తాప్సి కి అలంటి పాత్రలే ఎక్కువ వస్తూ ఉన్నాయట. ఇలా తనని టైప్ కాస్ట్ చేయడం తాప్సి కి ఎంత మాత్రము నచ్చడం లేదు అని తెలుస్తుంది. అందుకనే ఇక పై అలాంటి పాత్రల ని ఒప్పుకోకూడదు అని తాప్సి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాప్సి కి చాలా మంది నిర్మాతలు ఎక్కువ పారితోషికం కూడా ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారట కానీ తాప్సి మాత్రం అలాంటి పాత్రలు చేయడానికి ససేమిరా అంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -