Friday, April 19, 2024
- Advertisement -

అవుట్ అయ్యి కూడా గేమ్ ఆడుతున్న తాప్సి

- Advertisement -

తాప్సి ప్రధాన పాత్ర లో అశ్విన్ శరవణన్ దర్శకత్వం లో ఇటీవలే వచ్చిన చిత్రం గేమ్ ఓవర్. గత వారం శుక్రవారం నాడు ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అయింది. అయితే ఈ సినిమా కి మొదటి రోజున సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదల అయినా మూడు భాషల్లో అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు అనే టాక్ ని కూడా స్ప్రెడ్ చేశారు. తాప్సి ఈ సినిమా లో కనబర్చిన పర్ఫార్మెన్స్ ఇంకా ఏ సినిమాలో చేయలేదు అని తాప్సి కి కూడా పెద్ద ఎత్తున హైప్ ఇచ్చారు అందరూ. సినిమా తిరుగులేని విజయం సాధిస్తుంది అని జోస్యం కూడా చెప్పారు.

కట్ చేస్తే సినెమా కి థియేటర్ ల లో జనాలు లేరు. నార్త్ లో కొన్ని చోట్ల సినిమా ని తీసేసి వేరే సినిమా ల ని కూడా ఆడించుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచు మించుగా అదే పరిస్థితి. సెలబ్రిటీలు, క్రిటిక్స్, సోషల్ మీడియా పైడ్ ఇంఫ్లూయెన్స్అర్స్ సినిమా ని పొగుడుతున్నారు కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా ని పట్టించుకోవడం లేదు.

అయితే ఈ విషయం తాప్సి కూడా తెలుసు కానీ ఇంకా సినిమా బాగా నడుస్తుంది అనే ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా లో. అయితే ఎవరైనా నెగటివ్ గా స్పందించినా కూడా వాళ్ళకి వెంటనే కౌంటర్ కూడా వేస్తుంది తాప్సి. ఇది పక్కన పెట్టి కొంచెం ప్రమోషన్స్ పైన ఎక్కువ దృష్టి పెడితే జనాలు థియేటర్ వరకు వస్తారు కదా అని కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -