Wednesday, April 24, 2024
- Advertisement -

మళ్ళీ పదిహేను మంది తో బిగ్ బాస్ హౌస్

- Advertisement -

మేము ఆల్రెడీ రివీల్ చేసినట్లు గానే మొదటి వారం బిగ్ బాస్ ఇంటి నుండి హేమ ఎలిమినేటి అయ్యారు. ఆరుగురు నామినేషన్ లో ఉండగా, ప్రజలు అందరూ హేమ ఇంటి నుండి వైదొలగాలి అని కోరుకున్నారు. వోటింగ్స్ లో అదే స్పష్టత కనిపించింది. అంతే కాకుండా ఆసక్తికరం అంశం ఏంటి అంటే హేమ ఇంట్లో ఉన్న అందరిలో కి బాడ్ పర్సన్ అని హౌస్ మేట్స్ కూడా తేల్చేశారు. ఇదంతా పక్కన పెడితే హేమ ఇంటి నుంచి బయటకు వచ్చాక నాగార్జున అదే విషయం ప్రస్తావించినప్పుడు, “నేను హౌస్ లో అందరినీ నా పిల్లల లాగానే చూసుకున్నాను. నా మాట తీరు వాళ్లకి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఆలా అని ఉంటారు.” అని నాగార్జున తో చెప్పింది. తనని తప్పుగా అర్ధం చేసుకున్నారు అని కూడా సెలవిచ్చింది హేమ.

ఇకపోతే హేమ వెళ్ళిపోగానే నాగార్జున వైల్డ్ కార్డు ఎంట్రీ ని రంగం లోకి దింపాడు. తమన్నా సింహాద్రి ఈ షో లో 15 వ కంటెస్టెంట్ గా మళ్ళీ అడుగు పెట్టింది. ట్రాన్సజెండర్ తమన్నా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనని తాను బాగా తెలుసుకోవాలనే ఉదేశ్యం తో నే షో కి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక తమన్నా షో లో కి అయితే వచ్చింది కానీ ఇంట్లో కి ఎప్పుడు వెళ్తుంది అనే విషయం మీద క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -