Thursday, April 25, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లోకి ష‌కీలా…ఏ పార్టీలో చేరుతుందంటే….?

- Advertisement -

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర పొలిటిక‌ల్ న్యూస్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు రాజకీయాలపై తమ ముద్ర వేయాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్న కమల్.. రజనీల పార్టీల పరిస్థితి ఇప్పటివరకూ దూకుడుగా ఉన్నది లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తారా లేకా ర‌జినీ ఏర్పాటు చేయ‌బోయే పార్టీతో క‌ల‌సి వెల్తారా లేదా అన్న‌ది అనుమానంగానే ఉంది.

తాజాగా శృంగారతారగా.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన షకీలా సంచలన ప్రకటన చేశారు. ఆమె రాజ‌కీయాల్లో వ‌చ్చేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తన అభిమాన నటుడు కమలహాసన్ ఆహ్వానిస్తే… ఆయన స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణంగానే తాను శృంగార తారగా నటించాల్సి వచ్చిందన్నారు. ఈ కారణంతోనే తనపై శృంగార తార అన్న ముద్ర పడిందని.. అది తన దురదృష్టమన్నారు. మిగిలిన నటీనటులు ఎవరూ కమల్ పార్టీలో చేరతానని చెప్పకున్నా..ష‌కీల స్ప‌దించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. షకీలా ప్రకటనపై కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -