అదే జరిగితే, సమంత తో చెయ్యను అంటున్న దర్శకుడు

201
Tamil Director Gopi Nayanar will do the film with Samantha
Tamil Director Gopi Nayanar will do the film with Samantha

ఓ బేబీ సినిమా విజయం సాధించిన దగ్గర నుండి సమంత తదుపరి చిత్రం ఏంటి అనే దాని మీద అందరికీ ఎక్కడ లేని ఆసక్తి వచ్చింది. ఇప్పటి వరకు సమంత నుంచి అధికారికం గా ప్రకటన ఏమి రాలేదు కానీ సమంత ఏ సినిమా చేస్తుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇచ్చే వాళ్ళు లేరు. అయితే గోపి నయనార్ అనే తమిళ దర్శకుడి తో సమంత పని చేస్తుంది అనే టాక్ నడుస్తుంది ప్రస్తుతం. కాకపోతే ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది అంటున్నారు కొందరు.

ఇది కూడా ఇంతకు ముందు దర్శకుడు తెరక్కెక్కించిన సినిమాల లాగా స్ట్రాంగ్ కథ తో ఉండనుందట. అయితే మీడియా లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమా ఇంతకు ముందు ఈ దర్శకుడు చేసిన అరం అనే సినిమా కి రెండో భాగం. కాకపోతే దర్శకుడు ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చేసాడు.

సమంత తో పని చేస్తున్న విషయాన్ని ధృవీకరించిన దర్శకుడు అరం కి రెండో భాగమే చేస్తే, అది సమంత తో చేసేది లేదని,నయనతార తో నే చేస్తాను అని క్లియర్ గా చెప్పేసాడు. సమంత తో సినిమా లో కూడా ఒక సోషల్ మెసేజ్ ఉండబోతుంది అని కూడా చెప్పాడు.

Loading...