Thursday, April 25, 2024
- Advertisement -

#RRR ప్రాజెక్ట్‌లో మ‌రో స్టార్ యాక్ట‌ర్‌!

- Advertisement -

ఎస్ ఎస్ రాజ‌మౌళి.. మోస్ట్ స‌క్సెస్ రేట్ ఉన్న డైరెక్ట‌ర్‌ల‌లో ఒక‌రు. సినిమా తీయ‌డానికి సంవ‌త్స‌రాల పాటు టైమ్ తీసుకున్నా.. స‌క్సెస్ రేట్ మాత్రం ఎవ‌రూ ఎక్స్‌పెక్ట్ చేయ‌నంత ఉంటుంది. కార‌ణం కాస్టింగ్‌.. అండ్ టెక్నిషియ‌న్స్ ఎంపిక‌లో అత‌నికి ఉన్న శ్ర‌ద్ధ. బాహుబ‌లి బంప‌ర్‌హిట్ త‌ర్వాత ఎస్ఎస్ రాజ‌మౌళి చేప‌ట్టిన మ‌రో భారీ ప్రాజెక్ట్ RRR. రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి. త‌న మూవీలో క్యాస్టింగ్‌, టెక్నిషియ‌న్స్‌పై అత్యంత శ్ర‌ద్ధ తీసుకునే రాజ‌మౌళి టీమ్‌.. RRRలో ఓ పాత్ర‌కు క‌న్న‌డ యాక్ట‌ర్‌ను తీసున్న‌ట్టు టాక్‌.

క‌న్న‌డ డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని RRRలో ఓ లీడ్ రోల్‌లోచోటు సంపాదించుకున్న‌ట్టు ఇటు టాలీవుడ్‌.. అటు కోలీవుడ్ కోడై కూస్తుంది. దీనికి మించి మ‌రే స‌మాచారం బ‌య‌టికి లీక్ కానివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ విష‌యం కూడా ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌ముద్ర‌ఖ‌ని రివిల్ చేశారు స‌ముద్ర‌ఖ‌ని. ఇక ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ రిసెంట్‌గా స్టార్ట‌య్యింది. విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ కావ‌డంతో ఈ మూవీపై రామ్ చ‌ర‌ణ్ గంపెడు ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ మూవీకి MM కిర‌వాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్, సినిమాటోగ్రాఫ‌ర్‌గా సెంథిల్ కుమార్‌.

https://www.youtube.com/watch?v=sbc_S67jI4M

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -