Thursday, March 28, 2024
- Advertisement -

44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తలైవా

- Advertisement -

సౌత్ ఇండియాలో మీ అభిమాన హీరో ఎవరు అంటే చాలామంది ముందుగా సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెప్పి ఆ తరువాతే మిగతా వారి పేర్లు చెబుతారు. సౌత్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో లలో రజనీకాంత్ కూడా ఒకరు. అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా ‘2.0’ భారీ బడ్జెట్ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచిన ఘనత కేవలం మన రజనీకాంత్ కే దక్కింది. ఇవాళ్టితో రజనీకాంత్ నటుడిగా మారి 44 సంవత్సరాలు గడిచింది. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో తలైవా పైన శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు.

రజనీకాంత్ మొట్టమొదటిసారిగా నటించిన ‘అపూర్వ రాగంగల్’ అనే సినిమా 1975 లో విడుదలైంది. కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాతో రజినీకాంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ వెంటనే రజనీకాంత్ హీరోగా మారిపోయారు. ఇక అప్పటి నుంచి రజనీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ప్రతి సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతున్న తలైవా సినిమాల పరంగా ఈ మధ్యనే తో తమిళంలో ‘పెట్టా’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం రజిని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -