Tuesday, March 19, 2024
- Advertisement -

ఎట్టకేలకు బయ్యర్లను ఆకర్షించిన సూర్య చిత్రం. ఆర్. NGK గా సూర్య, ఎట్టకేలకు అమ్ముడుపోయింది

- Advertisement -

సూర్య ప్రధాన పాత్రలో శ్రీ రాఘవ దర్శకత్వం లో త్వరలో మన ముందుకి వస్తున్న చిత్రం NGK. NGK అంటే నంద గోపాల కృష్ణ. 7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలను దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్ ఈ సినిమా దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పథకాల పై సంయుక్తం గా ఈ సినిమా నిర్మించబడుతుంది.

ఇప్పటికే తమిళం లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉనప్పటికి తెలుగు లో ఈ సినిమా ఇంకా ఎవరూ కొననందు వలన ఇప్పటి వరకు ప్రమోషన్స్ ఏమీ జరగలేదు. తాజా వివరాల ప్రకారం ఈ సినిమాని తెలుగు లో కె కే రాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం పై విడుదల చేయనున్నారు. ఈ విషయం పై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సూర్య తో పాటు సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. మే 31 వ తారీఖున తమిళం లో పాటు తెలుగు లో కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. యువన్ శంకర్ రాజా ఈ సినిమా కి సంగీతం అందించగా ఎస్ ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమా నీ నిర్మించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -