Wednesday, April 24, 2024
- Advertisement -

ఇక తమిళనాడు లో 24 గంటలూ సినిమాలే

- Advertisement -

ఏవైనా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నప్పుడు నిర్మాతలు థియేటర్లలో ఎక్కువ షోలు వేసుకునేందుకు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పర్మిషన్లు సులువుగా లభిస్తూ ఉంటాయి కానీ తెలంగాణా లో మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం పరిస్థితి ఇంకొక లా ఉంది. కేవలం పెద్ద బడ్జెట్ సినిమాలకే కాక తమిళనాడు గవర్నమెంట్ మీడియం రేంజ్ సినిమాలకు కూడా ఎక్స్ట్రా షోలు వేసుకునేందుకు పర్మిషన్ లు ఇచ్చేందుకు త్వరలో జి.ఓ పాస్ చేయనుంది. తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఇప్పటి నుంచి కొన్ని థియేటర్లు మరియు షాపింగ్ మాల్స్ వారు 24 గంటలు సినిమాను వేసుకోవచ్చు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో లాగానే ప్రతి సినిమాకి థియేటర్ వాళ్లు వారు నాలుగు షోలు వేసుకోవచ్చు. అప్పుడప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలకు విడుదలైన మొదటి వారంలో ఎక్స్ట్రా రెండు షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చేవారు. కానీ తాజాగా తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల తమిళ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియం రెండు సినిమాల సంగతి పక్కన పెడితే పెద్ద బడ్జెట్ సినిమాలకు మాత్రం ఈ కొత్త రూల్ బాగా పెద్ద అడ్వాంటేజ్ గా మారబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -