Tuesday, April 23, 2024
- Advertisement -

సోష‌ల్ మీడియాలో తాప్సీని ఓ ఆట ఆడుకుంటున్నారుగా..!

- Advertisement -

తాప్సీ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి ఎందుక‌నో అనుకున్నంత సక్సెస్ కాలేదు.దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది.బాలీవ‌డులో అమ్మ‌డు ల‌క్ బాగానే ఉన్న‌ట్లుంది.ఆమె న‌టించిన సినిమాలు బాలీవుడ్‌లో మంచి విజ‌యాలు సాధించాయి.అయితే తాప్సీ సినిమాతో క‌న్నా వివాద‌ల‌తోనే ఎక్కువుగా సావాసం చేస్తుంది.తాజాగా ఆమె న‌టించిన ‘మన్మర్జియాన్’ సినిమా విడుద‌లైంది.ఈ సినిమాకుమంచి రివ్యూస్ క్రిటిక్స్ తో ప్రశంసలు లభించాయి. కాక‌పోతే సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి.సినిమాలో కొన్ని సీన్స్ పై సిక్కు మతానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫిలిం మేకర్స్ లేని పోని వివాదాలు ఎందుకని ఆ సీన్స్‌ను సినిమానుండి తొలగించారు.

అయితే ఈ విష‌యం తాప్సీ తెలియ‌కుండానే సినిమాలోని కీల‌క సీన్స్‌ను తొల‌గించారటా.ఈ విషయం తాప్సీ కి నచ్చలేదు. ఇక అదే విషయన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. “ఒకరి మనోభావాలను సెన్సార్ చేయాలనీ నా మతం నేర్పలేదు. మరి మతపరిరక్షకులుగా చెప్పుకునేవారికి ఒక మహిళ ఏం ఆలోచించాలో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు? ఇక మాట్లాడకుండా ఊరుకుంటే మీకేం కావాలో.. ఏం వద్దో ఎలా తెలుసుస్తుంది.. నేనైతే ఊరుకోను.” అని గట్టిగా చెప్పింది. దీంతో ఆమెపై సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు నెటిజ‌న్లు.ఓ నెటిజ‌న్ అయితే ఓ అడుగు ముందుకేసి మ‌రి తాప్సీ పెదాల‌పై కామెంట్ చేశాడు.మ‌రి ఈ కామెంట్స్‌పై తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -