అత‌డిని ప్రేమించా.. కాని మోసాం చేశాడు – తాప్సీ

615
TAPSEE PANNU SHOCKING REVELATION first love
TAPSEE PANNU SHOCKING REVELATION first love

తాప్సీ హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టింది. ర‌వితేజ‌,ప్ర‌భాస్‌,గోపిచంద్ వంటి హీరోల‌తో న‌టించిన ఆమెకు స‌రైన స‌క్సెస్ రాలేదు. దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. అమ్మ‌డు ఫిజిక్‌కు ,అందాల ఆరబోత‌కు బాలీవుడ్ అయితే క‌రెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని భావించారు. దీనికి త‌గిన‌ట్లుగానే అమ్మ‌డికు అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. అమితాబ్‌తో క‌లిసి న‌టించిన పింక్ సినిమాలో తాప్సీలో న‌టి బ‌య‌టికి వ‌చ్చింది.

ఈ సినిమాలో తాప్సీ యాక్టింగ్‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందాయి. తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు త‌న సినీ జీవితం బాగుంద‌ని చెప్పుకొచ్చింది. ఇక త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది తాప్సీ. తొమ్మిదో తరగతిలోనే తాప్సీ ప్రేమలో పడిందట. కానీ తను ప్రేమించిన వ్యక్తి పదో తరగతి పరీక్షలు వస్తున్నాయని తనను వదిలేశాడట. ఆ టైప్‌లో నాకు చాలా బాధేసింద‌ని చెప్పుకొచ్చింది తాప్సీ. ఇప్పుడు ఇవన్నీ తలచుకుంటే నవ్వొస్తుందని తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతు న‌చ్చిన వ్య‌క్తి క‌నిపిస్తే త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాన‌ని తెలిపింది తాప్సీ.