Thursday, March 28, 2024
- Advertisement -

అవ‌కాశాలు రాక‌పోతే అలా చేయ‌డ‌మేంటో..!

- Advertisement -

ఈ రోజుల్లో సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం గొప్ప కాదు , వ‌చ్చిన అవ‌కాశాన్ని నిలుపుకోవ‌డం గొప్ప‌. ఇప్పుడు ఈ మాటలు ఎందుక‌ని అనుకుంటున్నారా..? ఏం లేదండి… విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచియం అయింది ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో అమ్మ‌డు న‌ట‌న చూసి టాలీవుడ్ ఫిదా అయింది. పైగా తెలుగు అమ్మాయి కావ‌డంతో ప్రియాంకకు వ‌రుస సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలామంది భావించారు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయింది. టాక్సీవాలా త‌రువాత ప్రియాంకకు ఒక్క అవ‌కాశం కూడా రాలేదు. దీంతో అంద‌రి హీరోయిన్ల మాదిరిగానే సోష‌ల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోల‌తో ఆ మ‌ధ్య హ‌ల్ చ‌ల్ చేసింది.

ఈ ఫోటోల్లో చీర క‌ట్టుకుని చాలా ప‌ద్దతిగా క‌నిపించింది. చీర‌లో ప్రియంక‌ను చూసి , చీరలో ఇంత అందం దాగి ఉందా అంటూ కామెంట్స్ చేశారు. అయితే సినిమాల్లో మాత్రం అవ‌కాశం రావ‌డం లేదు. దీంతో చేసేది లేక గ్లామ‌ర్‌కు డోర్లు ఎత్తేసింది. తాజాగా త‌న హాట్ హాట్ అందాను ప్ర‌ద‌ర్శిస్తు సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరింత గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తోంది. అయితే ఈ ఫోటోల‌ను చూసి ప్రియాంక‌ను కూడా ట్రోల్ చేస్తున్నారు. సినిమాల్లో అవ‌కాశాలు రాక‌పోతే ఇలా చేయడం ఏమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనిపై ప్రియాంక జవాల్కర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -