Thursday, April 25, 2024
- Advertisement -

అఫర్ కావాలంటే సుఖం ఇవ్వాలి అన్నారు : తేజస్వి

- Advertisement -

హీరోయిన్ తేజస్వి.. ఈ భామ ముందుగా చిన్న పాత్రలు చేసి తక్కువ టైంలోనే హీరోయిన్ గా ఆఫర్స్ దక్కించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో చాన్స్ కొట్టేసి బాగా క్రేజ్ సంపాధించుకుంది. తాజాగా ఆమె ’కమిట్‍మెంట్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లను లైంగికంగా లొంగదీసుకోవాలని.. కమిట్మెంట్ కు ఓకే చెబితేనే అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు.

తనను ఎంతోమంది నేరుగానే కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగారని చెప్పింది తేజస్వి. సినీ పరిశ్రమలో ఎక్కువ మొత్తంలో కమిట్‌మెంట్ అడిగేవారే ఉన్నారని, వాళ్లందరినీ దాటి వెళ్తేనే అసలైన సినిమా వాళ్ళు కనిపిస్తారని చెప్పుకొచ్చింది. బాంబే హీరోయిన్స్ అన్నింటికీ సిద్ధంగా ఉంటారు కాబట్టే వారికే అవకాశాలు ఇస్తున్నారని, ఆ హీరోయిన్లకు పడక సుఖం ఇవ్వాలని ముందే తెలుసని.. అలాంటి వాళ్ళవల్లే తెలుగు హీరోయిన్స్‌కి చెడ్డపేరు వస్తోందంటూ తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక ఇండస్ట్రీలో తనకు తెలిసిన హీరోయిన్స్ చాలా మంది కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదురుకున్నారని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని తేజస్వి చెప్పింది. ఇక గతంలో ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని.. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని.. కానీ ఇండస్ట్రీలో ఉండటం వల్ల నాపై తనకు నమ్మకం పోయి బ్రేక్ అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు తాను నటిగా చాలా పరిణితి చెందానని.. తాను నటించిన’కమిట్‍మెంట్’ సినిమా మెచ్యూరిటీతో నటించానని చెప్పింది. నలుగురు అమ్మాయిల విభిన్న కథల ఆధారంగా ‘కమిట్‌మెంట్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకి లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించారు.

హాట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

రష్మీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శిల్పా చక్రవర్తి..!

బాలకృష్ణ మాటలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు : పోసాని

అత్తగారింట్లోనే ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -