Friday, March 29, 2024
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ’సైరా నరసింహా రెడ్డి’. సూపర్ హిటైన ఈ సినిమాని ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా మంది ప్రశంసించారు. కలెక్షన్స్ లో కూడా ఈ చిత్రం దూసుకెళ్తోంది. అయితే మెగాస్టార్ కు సీఎం కేసీఆర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల సైరా బయ్యర్లు పండగ చేసుకోబోతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నడుస్తున్న విషయం తెలిసిందే. బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించిన కేసీఆర్.. దసరా సెలవులు మరో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పది రోజులకు పైగా సెలవలను ఇచ్చింది. ఇప్పుడు మరో పది రోజులు పొడించారు. పండగ తర్వాత స్కూల్స్ కి వెళ్లేవారికి బస్సులు లేక ఇబ్బంది కలుగుతుందని మరో వారం రోజులు సెలవలను పోడించారు తెలంగాణ సర్కార్. మాములుగా అయితే అక్టోబర్ 14న స్కూల్స్ ఓపెన్ కావాలి.

ఇప్పుడు ఆక్టోబర్ 19 వరకు సెలవలు పెరిగాయి. ఈ హాలీడేస్ వల్ల సైరా సినిమాకు చాలా ప్లస్ అయింది. సైరా వచ్చి పది రోజులు అవుతున్న ఇంకా దూకుడు తగ్గాలేదు. భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 100 కోట్ల షేర్ ఇప్పటివరకు సాధించింది. ఇలాంటి టైంలో వారం రోజులు సెలవులు పెరిగితే కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే ఛాన్స్ చాలానే ఉంది. కేసీఆర్ వల్ల సైరా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు సంతోషంలో తెలుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -