మహేశ్ బాబుకు షాక్‌…షోకాజ్ నోటీసులు పంపిన తెలంగాణ ప్ర‌భుత్వం

618
Telangana govt show cause notice given to superstar mahesh babu
Telangana govt show cause notice given to superstar mahesh babu

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకు షాకిచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వం. మ‌హేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు రంగ‌రెడ్డి జిల్లా అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మ‌హేశ్ బాబుకు గ‌చ్చిబౌలిలో ఇటీవ‌లే ఓ మ‌ల్టీప్లెక్స్ థియోట‌ర్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఎఎంబీ సినిమాస్ పేరుతో క‌ట్టిన ఈ థియోట‌ర్‌ను భారీ ఎత్తున నిర్మించాడు మ‌హేశ్ బాబు. అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టికెట్ ధర రూ. 100, దానికి తక్కువగా ఉన్న సందర్భాల్లో గతంలో ఉన్న 18 శాతం జిఎస్టీ రేటును 12 శాతానికి తగ్గించారు.

జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రావాల్సి ఉంది. మంగ‌ళ‌వారం ప‌లు మ‌ల్టీప్లెక్స్‌లును సంద‌ర్శించి నమూనా టికెట్లను సేకరించారు జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు. మ‌హేశ్ బాబుకు సంబంధించిన ఎఎంబీ సినిమాస్ పాత రేట్ల ప్రకారమే టికెట్లను అమ్ముతున్నట్లు తేల‌డంతోనే అతనికి షోకాజ్ నోటీసులు పంపించారు రంగ‌రెడ్డి జిల్లా అధికారులు. ఈ విష‌యంలో మ‌హేశ్ బాబుపై కేసు కూడా న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌హేశ్ బాబు ప్రస్తుతం త‌న 25వ సినిమా మ‌హర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.