Thursday, April 18, 2024
- Advertisement -

మొన్న ప్ర‌దీప్.. నేడు యాంక‌ర్ ర‌వి

- Advertisement -

యాంక‌ర్స్‌కి టైమ్ బాలేదే..

తెలుగు యాంక‌ర్స్‌కి కాలం క‌లిసి రావ‌డం లేదు.మొన్న ప్ర‌దీప్ నేడు యాంక‌ర్ ర‌వి..అవును యాంక‌ర్స్ ఒకరు త‌రువాత ఒక‌రు వివాద‌ల‌లో చిక్కుకుంటున్నారు.ఈ మ‌ధ్య యాంక‌ర్ ప్ర‌దీప్ డ్రంక్& డ్రైవ్‌లో దొరికి పోలిస్ కౌన్సిలింగ్ కూడా హాజ‌రైయ్యాడు.రేపో మాపో కోర్టుకు కూడా అటెండ్ అవ్వ‌ల్సి ఉంది.మ‌రో యాంక‌ర్ ర‌వి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు.

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం రవి ఇవాళ ఉదయం కోర్టుకు వచ్చాడు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది.కాగా నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే చలపతిరావు చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

అది ఏంటో మ‌రి మహిళల‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు చలపతిరావుపై ఏంటువంటి చ‌ర్య‌లు తీసుకోపోగా స‌మ‌ర్దించిన యాంక‌ర్ పై కేసులు న‌మోదు కావ‌డం విశేషం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -