Saturday, April 20, 2024
- Advertisement -

ఫుల్ టైం పొలిటీషియన్ గా మారనున్న హేమ

- Advertisement -

సినిమా నటి గా ఎంతో ప్రాముఖ్యత ని సంపాదించుకున్న హేమ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. దాని ని బేస్ చేసుకొని తెలుగు రాష్ట్రాలు విడిపోయిన మొదటి సరి సమైఖ్యఆంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి శాసనసభ కి పోటీ చేశారు హేమ. కాకపోతే అక్కడ 2014 లో గెలవలేకపోవడం తో మళ్ళీ రాజకీయాల జోలి కి పోలేదు. చాలా రోజులు రాజకీయాలకి, రాజకీయ మీటింగ్స్ కి దూరం గా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవలే ఆవిడ మీడియా తో మాట్లాడుతూ తన మీడియా ప్లన్స్ గురించి మళ్ళీ చెప్పుకొచ్చారు.

అయితే హేమ బిగ్ బాస్ షో లో పాల్గొనబోతుందనే రూమర్స్ ఉన్న నేపథ్యం లో హేమ ఫుల్ టైం రాజకీయ నాయకురాలుగా మారబోతుంది అనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీడియా ప్రముఖుల తో మాట్లాడిన హేమ, రాజమండ్రి లో ఇల్లు కట్టుకున్నట్లు, త్వరలో నే తన మకాన్ని అక్కడకి మారుస్తున్నట్టు తెలిపింది.

అయితే ఆవిడ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. కాపు సంక్షేమం కోసం మొదటి బడ్జెట్ లో నే 2000 కోట్లు కేటాయించడం పై ఆవిడ హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఆవిడ ఈ రూలింగ్ పార్టీ లో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -