Friday, April 19, 2024
- Advertisement -

మరొక టాలెంటెడ్ హీరోయిన్ ని కాదనుకున్న టాలీవుడ్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎప్పటికి అప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ చాలా సార్లు మన తెలుగు లో ఉండే టాలెంటెడ్ హీరోయిన్ల ని మన ఇండస్ట్రీ కాదనుకుంటుంది. అప్పుడు వాళ్ళు వేరే సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి అక్కడ విజయం సాధిస్తూ ఉండటం మనం చూస్తూ నే ఉన్నాము. అయితే ఇప్పుడు ఆసక్తికర విషయం ఏంటి అంటే తెలుగు సినిమా పరిశ్రమ మరొక టాలెంటెడ్ హీరోయిన్ ని వేరే పరిశ్రమ కి వదులుకోవాల్సి వస్తుంది. తెలుగు లో గూడాచారి సినిమా తో అరంగేట్రం చేసిన శోభిత ని ఎవరూ పట్టించుకోలేదు.

ఒకవైపు అందం, మరో వైవు అభినయం కలబోసుకుని ఉన్న ఈ భామ ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ చేసింది. దాని తో వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా తన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు హిందీ పరిశ్రమ లో వరుస అవకాశాల తో శోభిత బాగా బిజీ గా గడుపుతుందట.

ఒక వైపు పెద్ద సినిమా లు చేస్తూ మరో వైపు వెబ్ సిరీస్ ల ని కూడా చేస్తూ చేతి నిండా పని తో శోభిత హిందీ లో సెటిల్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -