లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాలు.. ఇంకెంత షూట్ చేయాలంటే ?

427
telugu movies shooting left due to the lockdown
telugu movies shooting left due to the lockdown

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. అయితే షూటింగ్ ఆగిపోయిన సినిమాల.. వర్క్ ఎంతెంత బ్యాలన్స్ ఉంది అనే విషయం పై ఓ లుక్కేద్దాం.

ఆచార్య : కొరటాల -చిరు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం బ్యాలన్స్ ఉంది.

వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరో 25 శాతం బ్యాలన్స్ ఉంది.

ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి డైరెక్షన్లో చరణ్,ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరో 30శాతం బ్యాలన్స్ ఉంది.

ప్రభాస్ 20 : రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 70శాతం బ్యాలన్స్ ఉంది.

ఫైటర్ : పూరి జగన్నాథ్ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం బ్యాలన్స్ ఉంది.

ఉప్పెన : మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 5 శాతం బ్యాలన్స్ ఉంది.

క్రాక్ : రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకో 10శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

లవ్ స్టోరీ : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా 10 షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

నారప్ప : వెంకటేష్ నటిస్తున్న ‘అసురన్’ రీమేక్ షూటింగ్ కూడా 30 శాతం బ్యాలన్స్ ఉంది.

వైల్డ్ డాగ్ : నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50శాతం బ్యాలన్స్ ఉంది.

విరాట పర్వం : వేణు అడుగుల డైరెక్షన్లో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం మరో 10 శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

శ్రీకారం : శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 20శాతం బ్యాలన్స్ ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అఖిల్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరో 25శాతం బ్యాలన్స్ ఉంది.

రంగ్ దే : వెంకీ అట్లూరి డైరెక్షన్లో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 40 శాతం బ్యాలన్స్ ఉంది.

టక్ జగదీష్ : నాని -శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం బ్యాలన్స్ ఉంది.

Loading...