Saturday, April 20, 2024
- Advertisement -

తెలుగు బిగ్ బాస్ కి కంగారు మొదలైంది

- Advertisement -

బిగ్ బాస్ షో బాలీవుడ్ లో పెద్ద హిట్ అయింది. అందుకే ఆ షో ప్రాంతీయ భాషల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందుతుంది అనే ఉదేశ్యం తో మూడేళ్ళ క్రితం చాలా ప్రాంతీయ భాషల్లో ఈ షో ని లాంచ్ చేశారు నిర్వాహకులు. అందులో భాగం గా తెలుగు లో కూడా ఈ షో ని ప్రారంభం చేశారు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని వ్యాఖ్యాత లు గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ వచ్చే నెల లో మొదలు కానుంది. దానికి నాగార్జున ని వ్యాఖ్యాత గా తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

అయితే మొదటి సీజన్ షూటింగ్ లోనావాలా లో జరిగింది. రెండో సీజన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. మొదటి సీజన్ కి సంబందించిన వివరాలు, సమాచారం, షూటింగ్ అప్డేట్స్, షో ఎలిమినేషన్ సంగతులు.. ఇవన్నీ మొదటి సీజన్ లో షో టెలికాస్ట్ ఆయె సమయం వరకు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. రెండో సీజన్ కి అదేమి చెల్లలేదు. రేపు సాయంతం ఎలిమినేషన్ అంటే ఈ పాటికే ఎవరు వెళ్లిపోతున్నారు అనే విషయం తెలిసేది జనాలకి. ఎంత కష్టపడినా ఈ లీకులని నిర్వాహకులు ఆపలేకపోయారు.

అయితే ఇప్పుడు నాగార్జున షో వ్యాఖ్యాత అని అందరికీ తెలిసినా అధికారిక ప్రకటన కోసం అందరూ వేచి చూస్తున్నారు. అయితే నాగార్జున కి సంబందించిన ప్రోమోస్ చిత్రీకరణ నుంచి కొన్ని ఫోటోలు లీకవడం తో ఈ బిగ్ బాస్ ఇంకా మొదలుకాక ముందే ఇలా లీకుల బారిన పడింది అంటే, రేపు మొదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుంది అని నిర్వాహకులు అప్పుడే తల పట్టుకొని కూర్చున్నారు. అర్జెంట్ గా ఏదో ఒకటి చేస్తే కానీ నిర్వాహకులు ఈ సమస్య నుంచి బయట పడలేరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -