Friday, April 19, 2024
- Advertisement -

తెలుగులో కూడా విడుదల కానున్న వివాదాస్పద సినిమా

- Advertisement -

తెలుగులో కూడా మంచి పేరున్న తమిళ్ హీరోయిన్లలో అమల పాల్ కూడా ఒకరు. తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన ‘ఆడయి’ అనే సినిమా త్వరలో తమిళంలో విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కాబోతోందట. ప్రముఖ ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశారు. రత్న కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘ఆమె’ అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటుందని తమ్మారెడ్డి భరద్వాజ్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. బోల్డ్ అవతారంలో దర్శనమిచ్చిన అమల పాల్ అందరినీ షాక్ కి గురి చేసింది. మరి తమిళంలో వివాదాలు రేపిన ఈ సినిమా తెలుగులో మరెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. రామ్ బాబు కాళ్ళూరి మరియు ఎం విజయ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -