Saturday, April 20, 2024
- Advertisement -

హీరో ఆదికి బ్రేక్ ఇవ్వ‌బోతున్న నాని భార్య‌

- Advertisement -

బుర్రకథ సినిమా తో చతికిలపడ్డ హీరో ఆది సాయికుమార్ తన తర్వాతి సినిమా కోసం తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రెండు సినిమాల తో రెడీ గా ఉన్న ఆది ముందుగా జోడి అనే సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నాడు. ఈ సినిమా తో విశ్వనాధ్ అనే నూతన దర్శకుడు దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు.

ఈ సినిమా కి సంబందించిన టీజర్ ని ఈరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు దర్శక నిర్మాతలు. జోడి సినిమా మంచి ప్రేమ కథ తో మన ముందుకు రానుంది. అద్భుతమైన విజువల్స్, మంచి సంగీతం తో పాటు ఈ సినిమా లో కథ ఆసక్తికరం గా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఎట్టకేలకు ఆది ఈ సినిమా తో విజయ పథం లో కి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

ఆది, శ్రద్ద హీరో హీరోయిన్లు గా నటిస్తుండగా, ఈ సినిమా లో వెన్నెల కిషోర్, నరేష్, మిర్చి మాధవి,, గొల్లపూడి మారుతీ రావు, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశ్వనాధ్ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా కి ఫణి కళ్యాణ్ స్వరాలూ సమకూరుస్తున్నారు. విశ్వేశ్వర్ ఈ సినిమా కి ఛాయాగ్రాహకుడు. పద్మజ మరియు సాయి వెంకటేష్ గుర్రం నిర్మాణం లో ఈ సినిమా ని సమర్పిస్తున్నారు. భావన క్రియేషన్స్ పతాకం పై ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -