Friday, March 29, 2024
- Advertisement -

నితిన్ గెస్ట్ పాత్ర పోషించడానికి కారణం ఇదేనా

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్యనే ‘ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే గ్యాంగ్స్టర్ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. తమిళ్ లో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు అతర్వా మురళి. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఒక మాస్ అవతారంలో కనిపించనున్నాడు అని తెలుస్తోంది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 80స్ మరియు నైన్టీస్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో యువ హీరో నితిన్ గెస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే నితిన్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాంటిది నితిన్ గెస్ట్ పాత్ర పోషించడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అని సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ అందించిన హరీష్ శంకర్ అంటే కూడా అంతే అభిమానం. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ అడగ్గానే వెంటనే సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘వాల్మీకి’ సినిమా సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -