తొలిప్రేమ కీర్తి రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

3973
Tholi prema actress Keerthi reddy at cousin wedding
Tholi prema actress Keerthi reddy at cousin wedding

కీర్తి రెడ్డి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తొలి ప్రేమ సినిమానే. ఈ సినిమాలో ఆమె నటనకు ఎవరైన ఫిదా కావాల్సిందే. అందుకే ఆ సినిమా ఆ రెంజ్ లో హిట్ అయింది. అయితే కీర్తి రెడ్డి 2004 లో రిలీజ్ అయిన అర్జున్ సినిమా తర్వాత బయట పెద్దగా కనిపించలేదు.

2016లో యాక్టర్ సామ్రాట్ రెడ్డి పెళ్లిలో సందడి చేసింది కీర్తి. 2004లో హీరో సుమంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కీర్తి కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి బెంగళూరుకు చెందిన బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు. అయితే రీసెంట్ గా మరోసారి కీర్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజైనర్ శిల్పారెడ్డి, కీర్తి రెడ్డి దగ్గరి బంధువులు. రీసెంట్గా శిల్పారెడ్డి కజీన్ వివాహానికి కీర్తి హాజరయ్యింది.

కీర్తితో ఉనన్ కొన్ని ఫోటోస్ ని శిల్పా రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ వెడ్డింగ్ కు సెలబ్రేషన్స్ కి హీరో సుమంత్ కూడా హాజరయ్యారు. సుమంత్ తో ఉన్న ఫోటోని కూడా శిల్పారెడ్డి షేర్ చేసుకున్నారు. విడాకులు తీసుకున్నా కానీ ఇంకా కీర్తి తో కాంటాక్ట్ లో ఉన్నానని మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని గతంలో పేర్కొన్నారు సుమంత్. అందుకే ఈ వెడ్డింగ్ కి సుమంత్ హాజర్ అయినట్లు తెలుస్తోంది.

Loading...