Tuesday, March 19, 2024
- Advertisement -

మహేష్ బాబు ఫరెవర్ డిజైరబుల్.

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా విజయవంతం అయినా సందర్భంగా చాలా సంతోషం గా ఉన్నాడు. చాలా రోజుల తరువాత వేచి చూసిన విజయం కావడం తో ఎక్కడ లేని సంతోషం అంతా ప్రస్తుతం మహేష్ ఇంటి ముంగిట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ చేస్తుండటం తో పాటు సక్సెస్ మీట్ కూడా పెడుతూండటం మహేష్ సక్సెస్ ని ఎంత లా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుపుతుంది.

ఈ సక్సెస్ లో మరొక మైలు రాయి లాగా మహేష్ బాబు ప్రతి సంవత్సరం విడుదల అయ్యే టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా మహేష్ టాప్ 10 లో చోటు సంపాదించుకోవడం తో ఆగకుండా ఫరెవర్ డిజైరబుల్ మెన్ అనే లిస్ట్ లో కూడా చోటు సంపాదించుకునట్లు తెలుస్తుంది. ఫరెవర్ డిజైరబుల్ లిస్ట్ అనేది చాలా ప్రత్యేకమైన లిస్ట్. ఇందులో అందరినీ అంత త్వరగా ఎంపిక చేయరు కానీ సౌత్ నుండి ఒక నటుడు ఎంపిక అవ్వడం ఇదే మొదటిసారి. అందులోనూ మన తెలుగు నుండి మహేష్ బాబు ఎంపిక అవ్వడం ఇంకా ఆనందాన్ని ఇచ్చే విషయం.

ఇది ఇలా పోతే మహేష్ బాబు తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వము లో త్వరలో ప్రారంభించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -