“తిప్పరా మీసం” మూవీ రివ్యూ..!

477
tipparaa meesam review in telugu
tipparaa meesam review in telugu

శ్రీవిష్ణు హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “తిప్పరా మీసం”. ట్రైలర్, టీజర్ లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం ఈ రోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : డీజే గా పని చేసే శ్రీవిష్ణు.. జల్సాలు చేస్తూ బెట్టింగ్స్ చేస్తుంటాడు. అలా బెట్టింగ్స్ కు అలవాటు పడిన శ్రీవిష్ణు జీవితంలో ఏం జరిగింది ? ఎలాంటి మలుపు తిరిగింది ? తన తల్లినే అమితంగా ద్వేషించడానికి ఏదన్న బలమైన కారణం ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ శ్రీవిష్ణువే అని చెప్పాలి. ఈ సినిమాలో సరికొత్తగా కనిపించాడు. ఇక హీరోయిన్ నిక్కీ తంబోలి కూడా బాగా చేసింది. శ్రీవిష్ణు అతని తల్లికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రధానంగా సినిమా చివర్లో వచ్చే పది నిమిషాలు సినిమకే హైలైట్. అలాగే శ్రీ తల్లిగా చేసిన రోహిణి మరోసారి అద్భుత నటన పండించారు. బెట్టింగ్ సీన్స్ మరియు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సినిమాకు మరింత ప్లస్ అయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : దర్శకుడు ఎంచుకున్న కథ బానే ఉన్నా.. చూపించే విధానంలో ఎక్కడో తడబడ్డాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక్క శ్రీవిష్ణు పాత్రనే హైలైట్ చేసేందుకు ఎక్కువ టైం తీసుకున్నాడు. అందువల్ల సబ్జెట్ కు ఉన్న ప్రాధాన్యత తగ్గుతుంది. స్క్రీన్ ప్లే లో లోపం ఉంది. డ్రగ్ అడిక్ట్ మరియు అగ్రెసివ్ హీరో వంటివి మనం ఇదివరకే చూసాం కాబట్టి కొత్తగా ఏం అనిపించదు. దర్శకుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

మొత్తంగా :

హీరో శ్రీవిష్ణువుని దర్శకుడు కొత్త కోణంలో చూపించి సక్సెస్ అయ్యారు. మంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ అందర్ని ఆకట్టుకుంటాయి. స్క్రిన్ ప్లే పేలవగా ఉండటం ఇక్కడ మైనస్. సో శ్రీవిష్ణు ఫ్యాన్స్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు.

Loading...