Thursday, April 25, 2024
- Advertisement -

పెళ్లంటూ చేసుకుంటే వెంకటేష్‌నే.. రాశి కామెంట్స్…!

- Advertisement -

హీరోయిన్ రాశి అసలు పేరు విజయలక్ష్మీ. తన అందాలతో రెండు దశాబ్దాల క్రితం కుర్రాకారుని పిచ్చెక్కించింది ఈ భామ. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో ఆసక్తిర విషయాలను చెప్పుకొచ్చింది. ఒక వయసులో ఎవర్ని పెళ్లి చేసుకుంటావు అంటే హీరో వెంకటేష్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశారు ఎందుకని ? ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

తనకు ఆరేళ్ల వయసులో వెంకటేష్ సినిమాల హవా నడిచేదని.. ఆ టైంలో ప్రివ్యూ షోలకు తమకు పాసులు వచ్చేవని.. దాంతో వెంకీ సినిమాలను ఎక్కువగా చూసినట్లు చెప్పారు. దాంతో వెంకటేష్ గారిపై అభిమానం చాలా పెరిగిందని.. ఎవరైన వచ్చి ఎవర్ని పెళ్లి చేసుకుంటావని అడిగితే.. వెంటనే వెంకటేశ్ నని చెప్పేదానని.. అన్నారు.

కాస్త పెరిగిన పెద్దైన తర్వాత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మీద ఇష్టం పెరిగి.. ఆయన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పెదానని అన్నారు. ఇక దాదాపు 75 సినిమాల వరకు రాశి చేసింది. బాలకృష్ణతో బాలగోపాలుడు సినిమాలో బాలనటిగా చేసిన రాశి.. తర్వాత క్రిష్ణబాబు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక చిన్నప్పుడు ఎలా పలుకరించేవారో.. హీరోయిన్ అయ్యాక కూడా అలానే పలకరించేవారని బాలయ్య గురించి చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -