Thursday, April 25, 2024
- Advertisement -

నెటిజ‌న్ల‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చినా సురేఖావాణి కూతురు

- Advertisement -

సోష‌ల్ మీడియాలో నేటితరం యువతలో ట్రోల్స్ చేయడం అనే హాబీ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరంగా బాగా తగ్గింది. దీంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను నేరుగా చెబుతున్నారు. ఒక్కోసారి నెటిజ‌న్ల అభిప్రాయాలు సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త విష‌యాల్లో హ‌ద్దుమీరుతున్న సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

ఓ వ్యక్తిని ఏ కారణంగా ట్రోల్ చేస్తున్నాం? ఆ వ్యక్తిపై ఈ రకమైన కామెంట్లు చేయడం సబబేనా? అని కూడా ఆలోచించకుండా తమ తమ భావాలను ఇతరులపై రుద్దేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా నెటిజన్ల ట్రోల్స్ భారిన పడేవారు సెలబ్రిటీ మహిళలే అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. అయితే కొందరు మహిళామణులు ఇలా ట్రోల్స్ చేస్తున్న వారిని ఘాటుగా మందలిస్తుండగా, మరి కొంతమంది మహిళలు మాత్రం సైలెంట్ కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఇప్పుడు నటి సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా నెటిజన్లపై మండిపడింది. సురేఖావాణి కూతురు సుప్రిత షేర్ చేసిన ఓ వీడియోపై రెచ్చిపోయి కామెంట్లు పెడుతూ ఆమెను, ఆమె తల్లి సురేఖావాణిని తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఇది చూసిన సుప్రిత అలాంటి వారిపై విరుచుకుపడుతూ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది.

ఇటీవలే సుప్రీత తండ్రి, సురేఖ వాణి భర్త సురేష్ తేజ అకాల మరణం వారిరువురికి కలచి వేసింది. అదే బాధలో తండ్రికి తలకొరివి పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆవేదనను అందరితో పంచుకుంది సుప్రిత. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో సుప్రీతతో పాటు సురేఖావాణి కూడా బాధపడిందట. దీంతో తమను తిట్టినవాళ్లకు ధీటుగా సమాధానమిచ్చింది సుప్రీత.

మమ్మల్ని నెగెటివ్ కామెంట్స్ చేసేవారు అన్నీ తెలుసుకొని రియాక్ట్ అయితే మేలు. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయనేది తెలుసుకోండి. ముందు మీ లైఫ్ జాగ్రత్త.. తర్వాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి. కేవలం మీ వైపు నుంచే చూడకుండా మా వైపు నుంచి కూడా చుడండి. మా కోణంలో ఆలోచించండి. అప్పుడు మీరు సెట్ అవుతారు” అని పేర్కొంది.

https://www.instagram.com/p/ByekyfZlLb6/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -