Saturday, April 20, 2024
- Advertisement -

పెళ్లి చేసుకుని మోసం చేసిన సినీ రచయిత

- Advertisement -

డబ్బు కోసం తప్పుడు పని చేసిన ఒక సినీ రచయిత బాగోతం ఇవాళ వెలుగు చూసింది. ఒక సినిమా రచయిత ఎర్రంశెట్టి గౌతమ్ బంజారా హిల్స్ లో ఒక యువతిని మోసం చేసి పెళ్లి చేసుకుని, కేవలం కొన్ని గంటల్లోనే ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అసలు కథలోకి వెళితే సినిమాల్లో అసిస్టెంట్ రైటర్ గా పని చేసే గౌతమ్ కి ఒక యువతి తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు ఆ యువతి వెనుక ఈ సినీ రచయిత ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు.

ప్రేమ పెళ్లి అనే ముసుగులో ఆమెను మోసం చేసి ఆమె దగ్గర ఏకంగా పది లక్షల పాటు డబ్బులు కూడా కాజేశాడు. ఇదంతా చాలదన్నట్లు తాజాగా ఆమెను పెళ్లి చేసుకొని కాపురం చేయకుండా అదే రోజు ఆమెను వదిలేసి ఈ సినీ రచయిత పరారయ్యాడు. ఎంత వెతికినా ఆమెకు అతడి ఆచూకీ తెలియలేదు. దాంతో ఏం చేయాలో పాలు పోక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సినీ రచయిత పై కేసు పెట్టింది. కేసును నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -