Saturday, April 20, 2024
- Advertisement -

తీవ్ర విషాదంలో టాలీవుడ్….తిరిగిరాని లోకాలకు వెల్లిపోయిన కమెడియన్ వేణు మాధవ్..

- Advertisement -

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు తిరిగిరాని లోకాలకు వెల్లిపోయారు. వేణుమాధవ్ మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి వార్తను విని సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్. టాలీవుడ్‌లో 300లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు.

మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన టాలీవుడ్ టాప్ కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రం ద్వారా వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారు. 1979 డిసెంబర్ 30న తెలంగాణలోని కోదాడలో జన్మించారు. తన నాల్గో ఏట నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాడు.ముఖ్యంగా తెలంగాణ యాసలో వేణు మాధవ్ పండించే హాస్యానికి ఫిదా కానీ అభిమానులుండరు..

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంప్రదాయం’ సినిమాతో తెరంగేట్రం చేయకముందే.. అన్న ఎన్టీఆర్‌గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా పనిచేసాడు. అలా ఎన్టీఆర్ కి దగ్గరయ్యారు.ముందుగా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘సంప్రదాయం’తో కమెడియన్‌గా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -