Thursday, April 25, 2024
- Advertisement -

సల్మాన్ సినిమా కి స్టార్ తెలుగు డిస్ట్రిబ్యూటర్

- Advertisement -

బాలీవుడ్ సినిమా పరిశమ్ర లో నే అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా తెరకెక్కుతున్న చిత్రం భరత్. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లో సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ జంటగా నటించారు. దిశా పటాని కూడా ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర లో మెరవనుంది. టైగర్ జిందా హై ని తీసిన ఆలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమా కోసం మళ్ళి సలీమాన్ తో జత కట్టాడు. రంజాన్ సందర్భం గా ఈ సినిమా జూన్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమా ని తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయాలనీ అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. తాజా సమాచారం మేరకు గ్లోబల్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా కి సంబంధించిన తెలుగు మరియు హిందీ భాషల హక్కులని నైజాం, ఆంద్ర మరియు సీడెడ్ ప్రాంతాలకు సంపాదించుకున్నట్లు తెలుస్తుంది. భారీ స్థాయి లో ఈ సినిమా ని విడుదల చేసి సినిమా తో మంచి లాభాలు పొందాలని సునీల్ భావిస్తున్నారట.

ఈ సినిమా లో వరుణ్ ధావన్, నోరా ఫతేహి, సునీల్ గ్రోవర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -